ఎయిడెడ్ టీచర్లకు బయోమెట్రిక్
ABN , First Publish Date - 2021-09-03T05:53:51+05:30 IST
ప్పటివరకు ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఉండగా ఇక నుంచి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొందరు పాఠశాలలకు ఇష్టారీతిన హాజరవుతున్నారు

ఉత్తర్వులు జారీచేసిన కమిషనర్
ఒంగోలు విద్య, సెప్టెంబరు 2: ఇప్పటివరకు ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఉండగా ఇక నుంచి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొందరు పాఠశాలలకు ఇష్టారీతిన హాజరవుతున్నారు. కొందరు ముందే సంతకాలు పెట్టి విధులకు డుమ్మా కొడుతున్నారని తల్లిదండ్రులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్లకు బయోమెట్రిక్ విఽధానాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ఖజానా కార్యాలయానికి పంపించే ముందు డీఈఓలు/ఎంఈఓలు రిజిష్టర్‌లో హాజరు వివరాలు, సెలవు ఎంట్రీలు అన్ని పరిశీలించాలన్నారు. సంతృప్తి చెందితేనే జీతాల బిల్లులు ఖజానా కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ఎయిడెడ్ టీచర్లకు కూడా బయోమెట్రిక్ హాజరు అమలుపై ఏపీ టీచర్స్ గిల్డ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్రావు, సిహెచ్.ప్రభాకరరెడ్డి, కె.రమేష్‌లు ధన్యవాదాలు తెలిపారు.