మోటారుసైకిల్‌ అదుపుతప్పి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-07-24T06:19:17+05:30 IST

మండలంలోని దద్దవాడ గ్రామసమీపంలోని గురువారం అర్ధరాత్రి మోటార్‌ సైకిల్‌ అదుపుతప్పి ఒకరు మృతి చెందారు.

మోటారుసైకిల్‌ అదుపుతప్పి ఒకరి మృతి

కొమరోలు, జూలై 23 : మండలంలోని దద్దవాడ గ్రామసమీపంలోని గురువారం అర్ధరాత్రి మోటార్‌ సైకిల్‌ అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన కసినబోయిన లింగయ్య వ్యాపార నిమిత్తం వెళుతూ మార్గమధ్యంలో దద్దవాడ గ్రామసమీపంలో మోటార్‌ సైకిల్‌ అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో లింగయ్య తలకు బలమైన గాయం కావడంతో 108 వాహనంలో గిద్దలూరుకు తరలించగా మార్గమధ్యంలో లింగయ్య మృతిచెందినట్లు తెలిపారు.  


గుర్తుతెలియని మృతదేహం లభ్యం

పుల్లలచెరువు, జూలై 23: కొమరోలు అటవీ సమీపంలోని కొండపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్‌ఐ వేముల సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొమరోలు సమీపంలోని కొండపై గుర్తు తెలియని వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోయాడని శుక్రవారం వీఆర్వో నుంచి ఫిర్యాదు అందిందని తెలిపారు. సంఘటన  స్థలాన్ని పరిశీలించగా ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి చనిపోయినట్లు అక్కడ ఆధారాలు దొరికాయని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-07-24T06:19:17+05:30 IST