భవనం మీద నుంచి పడి బేల్దారి మేస్త్రీ మృతి
ABN , First Publish Date - 2021-12-26T06:08:53+05:30 IST
భవనం మీద నుంచి పడి బేల్దారి మేస్త్రీ మొగిలిచర్ల సురేష్(39) మృతి చెందాడు. ఈ సంఘటన ఒంగోలు నగరం సమతానగర్ 7లైన్‌లో శని వారం జరిగింది.

ఒంగోలు(క్రైం), డిసెంబరు 23: భవనం మీద నుంచి పడి బేల్దారి మేస్త్రీ మొగిలిచర్ల సురేష్(39) మృతి చెందాడు. ఈ సంఘటన ఒంగోలు నగరం సమతానగర్ 7లైన్‌లో శని వారం జరిగింది. స్థానిక ఆంధ్రకేసరీనగర్‌కు చెందిన ముప్పరాజు రవి సమతానగర్‌లో భ వనం నిర్మాణం చేసుకుంటున్నాడు. అయితే రవికి సురేష్ స్నేహితుడు. అనేకమార్లు భ వన నిర్మాణ పనులు పరిశీలించేందుకు వస్తుండేవాడు. ఈ నేపఽథ్యంలోభవనంలోని రెండో అంతస్తులో గల మెట్లకు సంబంధించి శుక్రవారం శ్లాబు పోశారు. దానిపై సు రేష్ ఎక్కడంతో కుప్పకూలీ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో తాలుకా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే సురేష్ అ క్కడ ఎవరితో అయినా గొడవ పడి జారి పడ్డాడా అనే అనుమానాలు ఉన్నాయి.