రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద అప్రమత్తంగా ఉండండి
ABN , First Publish Date - 2021-11-17T06:59:43+05:30 IST
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగంట మహీధర్‌రెడ్డి ఆదేశించారు.
సోమశిల నుంచి నీటి ప్రవాహం వచ్చే విధంగా కృషి : ఎమ్మెల్యే
లింగసముద్రం, నవంబరు 16 : ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగంట మహీధర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.3 అడుగుల నీటిమట్టం ఉందని, ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం 1500 కూసెక్కులు వస్తున్నట్టు డీఈ లక్ష్మీనారాయణ ఆయన వివరించారు. అయితే 18 అడుగుల నీరు వస్తే వరినార్లు, నాట్లుకు ఎన్ని రోజులకు నీరు సరిపోతుందని ఎమ్మెల్యే అడగ్గా, సుమారు 50 రోజులకు నీరు వస్తుందని డీఈ చెప్పారు. ప్రాజెక్టులో 20 అడుగులు చేరిన తరువాత నార్లు, నాట్లకు నీరిస్తే బాగుంటుందని డీఈ ఎమెల్యేకు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ తాను సోమశిల అధికారులతోను, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడి సోమశిల నుంచి ఎక్కువగా నీరు వచ్చేందుకు కృషి చేస్తాన్నారు. ఆ మేరకు ఆయన సోమశిల అధికారులతో మాట్లాడేందకు నెల్లూరు వెళ్లారు. అంతకుముందు ఆయన లింగసముద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య, ఎంపీడీవో కె శ్రీనివాసరెడ్డి, డీఈ హజరత్తయ్య, ఏఈలు పూర్ణచంద్రరావు, గిరిధర్, మనోహర్, చంద్రమౌళి, వైసీపీ మండల కన్వీనర్ పి తిరుపతిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మెన్ మేకనబోయిన శ్రీనివాసులు, కో-ఆప్షన్ సభ్యులు షేక్ షఫి, ఎంపీటీసీ దగ్గు వెంకటేశ్వర్లు, నాయకులు నోటి వెంకటేశ్వరరెడ్డి, వెన్నపూస బ్రహ్మారెడ్డి తదితరులు ఉన్నారు.