బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి
ABN , First Publish Date - 2021-07-09T05:08:29+05:30 IST
గిరిజన నేత స్టాన్ స్వామి మృతికి కారణమైన బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని ఎంపీజే నాయకులు డిమాండ్ చే శారు.

మార్కాపురం(వన్‌టౌన్), జూలై 8 : గిరిజన నేత స్టాన్ స్వామి మృతికి కారణమైన బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని ఎంపీజే నాయకులు డిమాండ్ చే శారు. స్థానిక గీతాంజలి పాఠశాలలో గురువారం జ రిగిన సమావేశంలో ఎంపీ జే కోశాధికారి ఎస్‌ఏ రజాక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టాన్ స్వామి మరో 15 మందిపై కేసు తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టిందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా గొంత్తెత్తిన వారిపై కేంద్ర ప్ర భుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. అన్యాయంగా అరెస్టు చేసిన రైతు ఉద్యమ నాయకులు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో ఎంపీజే నాయకులు రసూల్, కాశీం, ఖరిముల్లా, మహేష్ పాల్గొన్నారు.