‘ఆయుర్వేదం’కు ఆదరణేది..!

ABN , First Publish Date - 2021-05-30T05:41:03+05:30 IST

ఎంతో ప్రాశస్త్యమైన ఆయుర్వేద వైద్యం నైవేధ్యంలా మారింది.

‘ఆయుర్వేదం’కు ఆదరణేది..!
అరివేములలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల

 కనుమరుగవుతున్న భారతీయ చికిత్స

మూతపడిన వైద్యశాలలు

మొక్కుబడిగా నడుస్తున్న మరికొన్ని

వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత

పట్టించుకోని ప్రభుత్వం

కనిగిరి, మే 29: ఎంతో ప్రాశస్త్యమైన ఆయుర్వేద వైద్యం నైవేధ్యంలా మారింది.  కీళ్లనొప్పులు, చర్మవ్యా ధులు, దగ్గు, జ్వరం, జలుబు, స్ర్తీల సంబంధిత వ్యాధు లు, చర్మరోగాలు, పక్షవాతం, మూర్ఛ, ఉబ్బసం, పార్శ నొప్పులు, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాలు, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులను ఇట్టే పసిగట్టి  నయం చేసే అద్భుతమైన మందులు ఆయుర్వేదంలో ఉండేవి. 1956లో మన దేశంలో ఆయుర్వేద వైద్యశాలలు ఏర్పా టయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో  ఆయుర్వేద మందుల తయారీ కేంద్రం ఉండటంతో అక్కడి ప్రజలకు ఆయు ర్వేద చికిత్స సత్వరం అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో సొంత తయారీ కేంద్రం లేకపోవడంతో ఉత్త రాది (బొంబాయి, కోల్‌కత్తా, పంజాబ్‌, గుజరాత్‌) రా ష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా ఆయుర్వేద మందులకు నిధులు కూడా వి డుదల కావడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ వైద్యం కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి.

మూతపడిన వైద్యశాలలు 

జిల్లాలో 58 ఆయుష్‌ ఆయుర్వేద వైద్య శాలలు ఉం డేవి. రానురాను వైద్యులు, సిబ్బంది నియామకం చేప ట్టకపోవడంతో ఆదరణ కోల్పోయాయి.  ఒంగోలులో ఐ దు  పడకలతో ఉన్న ఆయుర్వేద రీజనల్‌ కేంద్రాన్ని రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తుంటారు. గతంలో కనిగిరి ప్రాంతంలో 9 ఆయుర్వేద వైద్యశాలలు నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌ ఆర్‌హెచ్‌ ఎం) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త నిధులతో నడిచేవి. ఎన్‌ ఆర్‌హెచ్‌ ఎం ద్వారా పదేళ్ల క్రితం వరకు నిరంతరా యంగా ఆయు ర్వేద వైద్యం ప్రజలకు కొంతవరకు అం దుబాటులో ఉండేది. 

కనిగిరి ప్రాంతంలో కనిగిరి, పామూరు, పీసీపల్లిలో వైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్స రీలు పామూరు మండలం కంభాల దిన్నె, సీఎస్‌పురం మండలం దర్శిగుంటపేట (డీజీ పేట), అరివేముల, వెలిగండ్ల మండలం మొగళ్లూరు, హనుమంతునిపాడు మండలం నందనవ నంలలో ఉండేవి. అయితే, వైద్యులు, సిబ్బంది కొరతతో మొగళ్లూరు, నందనవనం, కనిగిరి, పీసీపల్లి, పామూ రులో ఉన్న ఆయుర్వేద వైద్యశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఐదు ఆ యు ర్వేద కేంద్రాలు ఉన్నట్లు, ఆయా ప్రాంతా ల్లో అధికారిక లెక్కల్లో ఇప్పటికీ వైద్యం చేస్తున్నట్లు చూపిస్తున్నట్లు తెలు స్తుంది. ఆయా కేంద్రాల్లో కూడా కేవలం ఒకే ఒక్క ఆయుర్వేద మెడికల్‌ వైద్యుడు విధులు నిర్వహించడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. 

అరివేముల, డీజీ పేట గ్రామాల్లో అద్దె భవనాల్లో అరకొరగా నడుస్తున్నాయి. మొగళ్ళూరులో కొన్ని రోజలు పశువుల ఆసుప త్రిలో నిర్వహించగా, ఇప్పుడు పూర్తిగా వైద్యశాల ఎత్తి వేశారు.  నందనవనంలో ఆయుర్వేద వైద్యశాల ఆనవా ళ్లు లేవు. 

కాగా, చవన్‌ప్రాష్‌, సంషమనమతి, సుదర్శన గణప తి, అశ్వగంధ, అనే మందులు కరోనా వైరస్‌ నిర్మూ లనకు ఎంతో ఉపయోగకారిగా ఉంటాయి. వీటిని ఆ యుర్వేద వైద్యులు సలహా మేరకు ఉదయం, సాయం త్రం సేవిస్తే మంచి ఫలితాలుంటాయి.  కరోనా బారిన పడినవారికి కభాసుర కుడినీర్‌ సిరఫ్‌ ఎంతో మేలు చేస్తుంది. రోగిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేం దుకు ఆయుర్వేదంలో ఓజోప్లస్‌, భృహస్తుస్వాతు చింతామణి, వాతారిష్ట వంటి ఔషధాలు ఎంతో బలా నిస్తాయి. అశ్వగంధతైలం, పిండతైలం, గణసూదన తైలం, విషముష్టితైలం లాంటివి వ్యాధిని బట్టి నొప్పు లకు, రాచపుండ్ల నిర్మూలనకు ఎంతో ఉపయోగకర మైనవని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రభు త్వం స్పందించి ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-30T05:41:03+05:30 IST