నేర పరిశోధనపై జియోలకు అవగాహన

ABN , First Publish Date - 2021-04-18T06:32:11+05:30 IST

నేరం జరిగిన ప్రాంతంలో నేరానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేసే విధంగా జియోలు దృష్టి సారించాలని కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు సూచించారు.

నేర పరిశోధనపై జియోలకు  అవగాహన
నేర పరిశోధన విధానాన్ని వివరిస్తున్న డీఎస్పీ

కనిగిరి, ఏప్రిల్‌ 17: నేరం జరిగిన ప్రాంతంలో నేరానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేసే విధంగా జియోలు దృష్టి సారించాలని కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు సూచించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో శనివారం కనిగిరి సర్కిల్‌ పరిధిలోని జియోలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జియోలకు నేరాలపై పరిశీలన, పరిశోధన, సాక్షాల సేకరణ వంటి అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. చిత్తుపటం తయారీపై అవగాహన కల్పించారు. సమావేశంలో సర్కిల్‌ పరిధిలోని జియోలు పాల్గొన్నారు. 

ముండ్లమూరు : పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుల పరిశోధనపై శనివారం జియో (జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌)లకు శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో అవగాహన కల్పించారు. ఒంగోలు డీసీఆర్‌బీ డీఎస్పీ ఏవీ రమణ వారికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేసుపై అవగాహన కలిగి ఉంటే రానున్న రోజుల్లో విచారణ సులువుగా ఉంటుందన్నారు. ఇటీవల నమోదైన కేసులకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. జూనియర్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో దర్శి సీఐ ఎం భీమానాయక్‌, ఎస్సై జీ.వెంకట సైదులు, ఏఎ్‌సఐలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:32:11+05:30 IST