పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-08T06:26:44+05:30 IST

పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గుత్తా.శోభన్‌బాబు సూచించారు.

పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
సమావేశంలో గుత్తా.శోభన్‌బాబు

అధికారులకు ముగిసిన శిక్షణ తరగతులు

గ్రామాల్లో పర్యటించిన పోలీసులు

దర్శి, ఫిబ్రవరి 7 : పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గుత్తా.శోభన్‌బాబు సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం పోలింగ్‌ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వీడీబీ వరకుమార్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ షాహిదా, ఏఆర్‌ఐ ప్రసన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీఎస్‌పురం : పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో కట్టా శ్రీనువాసులు, తహసీల్దార్‌ బీ.వి.రమణారావులు పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో ఆదివారం ఎన్నికల అధికారులుగా నియమించిన  ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాదికారి జె.ప్రసాదరావు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పామూరు: ఈ నెల 9న జిల్లాలో జరిగే తొలి విడిత పోలింగ్‌ను ప్రిసైడింగ్‌ అధికారులు సమర్ధవతంగా నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారి ఎంపీడీవో ఎం.రంగసుబ్బారాయుడు కోరారు. స్థానిక స్ర్తీ శక్తి భవన్‌లో 140 మంది పీవోలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వీరికి పోలింగ్‌ పోలింగ్‌, విధానం గురించి అవగాహన కల్పించారు. ఎక్కడా ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్ధంగా ఎన్నికల డ్యూటీని నిర్వహించాలని సూచించారు. శిక్షణ కార్యాక్రమంలో తహసీల్దార్‌ ఉష, ఈవోపీఆర్‌డీ వి.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ముండ్లమూరు : ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఎన్నికల అధికారి ఎంవీ రమణమూర్తి అన్నారు. పోలింగ్‌ ఎలా నిర్వర్తించాలనే దానిపై పీవో, ఏపీవోలకు ఆయన ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరూ పార దర్శకంగా వ్యవహరించాలన్నారు. ఈవోఆర్డీ ఓబులేసు, పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాళ్లూరు : ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం పీవోలకు, ఏపీవోలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్‌ రోజున ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి విధులు నిర్వహించి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు.  ఓటు హక్కువినియోగించుకున్న వారి ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్కలు వాడాలన్నారు.  కార్యక్రమంలో ఈవోఆర్డీ దారా హనుమంతరావు, ఎంఈవో జి.సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

వలేటివారిపాలెం : మండలంలోని వలేటివారిపాలెం, పోకూరు, బడేవారిపాలెం, చుండిలలో నామినేషన్‌ కేంద్రాలను నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధికారి చంద్ర శేఖర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియను రిటర్నింగ్‌ అదికారులను అడిగి తెలుసుకున్నారు. రిటర్నింగ్‌ అదికారులకు చంద్రశేఖర్‌రెడ్డి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఎంపీడీవో రఫీద్‌అహ్మద్‌, ఈవోఆర్‌డీ అబ్దుల్‌బారి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దొనకొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని పొదిలి సీఐ వి.శ్రీరామ్‌ సూచించారు. మండలంలోని గంగదేవిపల్లి, ఇండ్లచెరువు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లోని వీధుల్లో ఆదివారం పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీరామ్‌ మాట్లాడుతూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు గ్రామాల్లో పోలీస్‌ కవాతు నిర్వహించినట్లు తెలిపారు.  గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే 9121102175 నంబరుకు ఫోన్‌ చేసి పోలీసులకు సహకరించాలని ఎస్సై ఫణిభూషణ్‌ గ్రామాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో దొనకొండ ఎస్సై బి.ఫణిభూషణ్‌, కొనకనమిట్ల ఎస్సై ఎం.వీ.నాయక్‌, తర్లుబాడు ఎస్సై ఏ.వెంకటేశ్వర్లు, 50 మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సీఎస్‌.పురం : పంచాయితీ ఎన్నికలు గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కందుకూరు డీఎస్పీ కండె శ్రీనువాసులు తెలిపారు. మండలంలోని కోవిలంపాడు, సీఎస్‌పురం నామినేషన్‌ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పామూరు సీఐ కొండవటి శ్రీనివాసరావు, ఎస్సై చుక్కా శివబసవరాజు ఆయనవెంట ఉన్నారు. 

Updated Date - 2021-02-08T06:26:44+05:30 IST