సొంత వైద్యం మానుకోవాలి
ABN , First Publish Date - 2021-08-25T06:04:50+05:30 IST
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో లక్షణాలు కనపడితే సొంత వైద్యం మానుకుని ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ సూచించారు.

నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్
కనిగిరి, ఆగస్టు 24: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో లక్షణాలు కనపడితే సొంత వైద్యం మానుకుని ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించు కోవాలని కోరుతూ పట్టణ సమీపంలోని దేవాంగనగర్‌లో మంగళవారం పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ వేస్తోందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా తప్పని సరిగా నిబంధనలు పాటించాలన్నారు. బయట తిరిగేవారు మాస్కులు ధరించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, డాక్టర్ ఎన్.నాగరాజ్యలక్ష్మీ, గుడ్‌హెల్ప్ రమేష్, ఏఎన్‌ఎంలు లక్ష్మీ, వార్డు వలంటీర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.