సారా తయారీ స్థావరాలపై దాడులు

ABN , First Publish Date - 2021-11-28T04:19:53+05:30 IST

ఎస్‌ఈబీ అధికారుల మూకుమ్మడి దాడిలో 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 1800 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు.

సారా తయారీ స్థావరాలపై దాడులు

గిద్దలూరు టౌన్‌, నవంబరు 27: ఎస్‌ఈబీ అధికారుల మూకుమ్మడి దాడిలో 80 లీటర్ల  సారాను స్వాధీనం చేసుకుని 1800 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఈబీ సీఐ అరుణకుమారి ఆధ్వర్యంలో గిద్దలూరు మండలం వెంకటాపురంతాండా అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై శనివారం దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1800 లీటర్ల బెల్లంఊటను గుర్తించి ధ్వంసం చేశారు. వెంకటాపురం గ్రామానికి చెందిన ఓబురాయి రమణను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 80 లీటర్ల  సారాను స్వాధీనం చేసుకున్నారు. రాచర్ల మండలం చోళ్లవీడులో దాడులు చేసి 400 లీటర్ల బెల్లంఊటను గుర్తించి ధ్వంసం చేశారు. మరో 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరు పరచగా, రిమాండ్‌కు విధించారని సీఐ తెలిపారు. 

Updated Date - 2021-11-28T04:19:53+05:30 IST