గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-12-30T05:40:42+05:30 IST
జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ రాచగొర్ల వెంకట సుశీల బుధవారం సాయంత్రం ఒంగోలులోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఒంగోలు(కల్చరల్), డిసెంబరు 29: జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ రాచగొర్ల వెంకట సుశీల బుధవారం సాయంత్రం ఒంగోలులోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కొద్దినెలల కిందట ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రంథాలయా లకు చైర్మన్‌లను నియమించింది. అయితే అనంతరం జరిగిన న్యాయపరమైన పరిణామాలతో ఆమె బాధ్యతలు తీసుకోలేదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మం గళవారం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వెంకట సుశీల బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాల పరిస్థితులను మెరుగుపరుస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రంథా లయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్‌రాజు, ఉపగ్రంథపాలకురాలు బొమ్మల కోటే శ్వరి, సిబ్బంది చైర్‌పర్సన్‌ను ఘనంగా సత్కరించారు.