బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అశోక్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-12T05:42:00+05:30 IST

హత్యకు గరైన చిన్నారి ఖాశింభీ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పరామర్శించారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అశోక్‌రెడ్డి
కుటుంబాన్ని ఓదార్చుతున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు, జూలై 11 : హత్యకు గరైన చిన్నారి ఖాశింభీ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పరామర్శించారు. ఆదివారం అంబవరం గ్రామానికి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను అశోక్‌రెడ్డి ఓదార్చారు. అధికారులతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించేలా కోరతానని చెప్పారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ఆయనవెంట టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బి.చంద్రశేఖర్‌యాదవ్‌, టీడీపీ నాయకులు గోపాల్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, బిల్లా రమేష్‌, పెద్దబాషా, కిశోర్‌కుమార్‌, బద్రి బాషా ఉన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి 

చిన్నారి ఖాశింభీని హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజనుల హక్కుల పోరాటసమితి రాష్ట్రశాఖ మహిళా అధ్యక్షురాలు గొట్టెముక్కల సుజాత కోరారు. ఖాశింభీ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. దిశ యాప్‌ గురించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆన్‌డ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్లు కొనుక్కునే స్థోమతలేని నిరుపేద మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చిన్నారి బాధిత కుటుంబానికి రూ.25లక్షల నష్టపరిహారాన్ని అందించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. 


Updated Date - 2021-07-12T05:42:00+05:30 IST