బకాయిలు వెంటనే చెల్లించాలి

ABN , First Publish Date - 2021-10-14T07:30:20+05:30 IST

ఒంగోలు డెయిరీలో ఉద్యోగులుగా పనిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్న, అలాగే రిటైర్‌ అయిన వారికి బకాయిలను తక్షణం చెల్లించాలని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

బకాయిలు వెంటనే చెల్లించాలి
సమావేశంలో పాల్గొన్న డెయిరీ విశ్రాంత ఉద్యోగులు

డెయిరీ మాజీ ఉద్యోగుల డిమాండ్‌ 

విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పాటు

ఒంగోలు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి ): ఒంగోలు డెయిరీలో ఉద్యోగులుగా పనిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్న, అలాగే రిటైర్‌ అయిన వారికి బకాయిలను తక్షణం చెల్లించాలని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. బకాయిల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యక్ష పోరాటం చేయాలని నిర్ణయించారు. అందుకోసం విశ్రాంత ఉద్యోగుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్థానిక డెయిరీ ఆవరణలో బుధవారం డెయిరీ మాజీ, రిటైర్డు ఉద్యోగుల సమావేశం జి.నారాయణరావు అధ్యక్షతన జరిగింది. సీఐటీయూ నాయకులు కాలం సుబ్బారావు, నరసయ్య పాల్గొన్నారు. డెయిరీ ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 2012 నుంచి రిటైర్‌ అయిన వారికి ఇంతవరకు బెనిఫిట్స్‌ను ఇచ్చింది లేదన్నారు. ఇప్పటివరకు డెయిరీ ఉద్యోగులు పోరాట కమిటీ పేరుతో కార్యక్రమాలు కొనసాగించిన వారు ఇక నుంచి డెయిరీ విశ్రాంత ఉద్యోగుల సంఘం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో ఎం.సత్యప్రసాద్‌, క.రమణారావు, రావూరి శివప్రసాద్‌, ఎం.సత్యప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-14T07:30:20+05:30 IST