అప్రకటిత విద్యుత్‌ కోతలు

ABN , First Publish Date - 2021-07-08T06:22:01+05:30 IST

రోజురోజుకూ విద్యుత్‌ కోతలు ఎక్కువ అవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్‌ ముగిసి జూలై వచ్చినప్పటికీ ఒక్కపక్క వర్షాలు లేకపోవడం, మరోపక్క ఎండవేడిమితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

అప్రకటిత విద్యుత్‌ కోతలు

రోజుకు 5 గంటలు నిలిపివేత

నరకం చూస్తున్న ప్రజలు

రాచర్ల, జూలై 7 : రోజురోజుకూ విద్యుత్‌ కోతలు ఎక్కువ అవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్‌ ముగిసి జూలై వచ్చినప్పటికీ ఒక్కపక్క వర్షాలు లేకపోవడం, మరోపక్క ఎండవేడిమితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క గంటలకొద్దీ కరెంట్‌ కోతలు అమలు చేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారో.. ఎన్ని గంటలలు విద్యుత్‌ కోత ఉంటోందో సంబంధి అధికారులు చెప్పడం లేదని, అప్రకటిత కోతలో నరకం చూస్తున్నామని ప్రజలు అంటున్నారు.  రాచర్ల మండలంలో గత పదిరోజుల నుంచి విద్యుత్‌ కోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాలలో విద్యుత్‌ కోతలను పెంచుతున్నారు. రాత్రి 7గంటల నుంచి 11గంటల వరకు విద్యుత్‌ కోతలు, మధ్యాహ్నం పూట 2గంటలపాటు ఎమర్జెన్నీ లోడ్‌ రిలీవ్‌ పేరుతో కోతలు విధిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏఈ రామచంద్రుడును వివరణ కోరగా విద్యుత్‌ కోతలు ఉన్న మాట వాస్తవమేనని, ఎమర్జెన్నీ లోడ్‌ రిలీవ్‌ పేరుతో ఈ కోతలు ఉన్నాయని, వర్షాలు కురవక పోవడంతో ఈ విద్యుత్‌ కోతలు ఎక్కువవుతున్నాయని తెలిపారు.


Updated Date - 2021-07-08T06:22:01+05:30 IST