అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-19T06:10:10+05:30 IST

స్పందనలో వచ్చే అర్జీలను వే గవంతంగా పరిష్కరించేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆదేశించారు.

అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 18: స్పందనలో వచ్చే అర్జీలను వే గవంతంగా పరిష్కరించేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలె క్టరేట్‌లోని స్పందన భవన్‌లో సో మవారం డయల్‌ యువర్‌ కలెక్ట ర్‌ కార్యక్రమంతో పాటు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. స్పందనలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని చెప్పారు. ఆయా శాఖల్లో అర్జీలు పెండింగ్‌ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల న్నారు. స్పందన, మీసేవ కార్యక్ర మాల ద్వారా వచ్చిన అర్జీలను నిర్ణీ త గడువులోపు పరిష్కరించే విధం గా ప్రత్యేక చర్యలు తీసుకోవాల న్నారు. ఈనెల 21,22 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ స్పందన కార్య క్రమం నిర్వహించనున్నట్టు చెప్పా రు. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజానీకం పలురకా ల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు జె.వెంకటమురళి, టీఎస్‌ చేతన్‌, కేఎస్‌ విశ్వనాథన్‌, కె.కృష్ణవేణి, డీఆర్వో సరళావందనం, సీపీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:10:10+05:30 IST