రైతుల మహాపాదయాత్రకు కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-11-09T14:13:25+05:30 IST

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

రైతుల మహాపాదయాత్రకు కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు

ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇంకొల్లులో రాజధాని రైతుల మహాపాదయాత్రపై అమరావతి జేఏసీ నేతల వద్దకు అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు వెళ్లారు. నిబంధనలకు అనుగుణంగా పాదయాత్ర కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మాహాపాదయాత్రపై జిల్లా పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పాదయాత్ర సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులు తెలిపారు. అయితే నిబంధనలకు అనుగుణంగానే పాదయాత్ర నిర్వహిస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-09T14:13:25+05:30 IST