మండలానికి మరో వైస్ ఎంపీపీ
ABN , First Publish Date - 2021-12-31T05:46:15+05:30 IST
జిల్లాలోని 53 మండలాలకు మరో వైస్ ఎంపీపీ కొలువుదీరనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనే 53 మండలాలకు ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీని కూడా ఎన్నుకున్నారు. మండలానికి మరో వైస్ ఎంపీపీని కూడా నియమించాలని ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో భాగంగా జనవరి 4న ఆయా మండలకేంద్రాల్లో ఎన్నిక నిర్వహించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చేపట్టనున్నారు.

జిల్లాలోని 53 మండలాలకు జనవరి 4న ఎన్నిక
నేడు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం
చేతులెత్తే విధానంలో ఎన్నిక
ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 30: జిల్లాలోని 53 మండలాలకు మరో వైస్ ఎంపీపీ కొలువుదీరనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనే 53 మండలాలకు ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీని కూడా ఎన్నుకున్నారు. మండలానికి మరో వైస్ ఎంపీపీని కూడా నియమించాలని ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో భాగంగా జనవరి 4న ఆయా మండలకేంద్రాల్లో ఎన్నిక నిర్వహించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చేపట్టనున్నారు. వైస్ ఎంపీపీని చేతులెత్తే పద్ధతిలో ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోనున్నారని జడ్పీ సీఈవో జాలిరెడ్డి తెలిపారు. అనివార్య కారణాలతో ఆ రోజు ఎన్నిక సాధ్యం కాకపోతే జనవరి 5న నిర్వహిస్తామని ఆయన చెప్పారు ఒకవేళ ఆ రోజు కూడా ఎన్నిక జరగకపోతే ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని జాలిరెడ్డి పేర్కొన్నారు.