మరో 811 కరోనా పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-05-30T07:17:42+05:30 IST

జిల్లాలో శనివారం కొత్తగా 811 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యా య. వాటిలో ఒంగోలు నగరంలో అధికంగా 83 ఉన్నాయి.

మరో 811 కరోనా పాజిటివ్‌లు
కరోనాతో మృతి చెందిన హెడ్‌నర్స్‌ సత్యవాణి

ఒంగోలులో అధికంగా 83 కేసులు  

జీజీహెచ్‌ హెడ్‌నర్స్‌ మృతి 

ఒంగలు (కార్పొరేషన్‌/కలెక్టరేట్‌), మే 29 : జిల్లాలో శనివారం కొత్తగా 811 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యా య. వాటిలో ఒంగోలు నగరంలో అధికంగా 83 ఉన్నాయి. ఒంగోలు రూరల్‌లో 49, చీమకుర్తి అర్బన్‌లో 37, పామూరులో 28, గిద్దలూరు అర్బన్‌లో 26, అద్దంకి అర్బన్‌లో 25, గుడ్లూరులో 19 కేసులు నిర్ధారణయ్యాయి. కొరిశపాడులో 19, చీరాల అర్బన్‌లో 18, పర్చూరులో 18, దర్శిలో 17, జె.పంగులూరులో 17, వెలింగండ్లలో 17, కందుకూరు అర్బన్‌లో 16, చిన్నగంజాంలో 15, దోర్నాల లో 15, నాగులుప్పపాడులో 15 వెలుగు చూశాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ పలువురుకి వైరస్‌ ఉన్నట్లు తేలింది. కరోనాతో ఒంగోలు జీజీహెచ్‌లో మరో హెడ్‌ నర్సు మృతి చెందారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన కె.సత్యవాణి (53) జీజీహెచ్‌లో పనిచేస్తున్నారు. పది రోజుల క్రితం  ఆమె కరోనా బారిన పడ్డారు. ఇక్కడే కొద్ది రోజులు చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించ డంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచారు. ఆమె మృతికి ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి మంజేష్‌, ఉపాధ్యక్షురాలు ఉదయలక్ష్మి, నర్సింగ్‌ స్కూలు ప్రిన్సిపాల్‌ ఎలిజబెత్‌, అంజమ్మ సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-05-30T07:17:42+05:30 IST