మరో 1,741 పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-05-05T06:29:02+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ ఉధృతి కొనసాగుతోంది. సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా 1741 కేసులు నమోదయ్యాయి.

మరో  1,741 పాజిటివ్‌లు

ఒంగోలులో అత్యధికంగా 194 కేసులు 

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 4 : జిల్లాలో కొవిడ్‌ ఉధృతి కొనసాగుతోంది. సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా 1741 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒంగోలులో 194, చీరాల అర్బన్‌లో  80,మార్కాపురం అర్బన్‌లో 71 ఉన్నాయి.వేటపాలెంలో 69, ఒంగోలురూరల్‌లో 60,ఇంకొల్లులో 58, పర్చూరులో 56, కనిగిరి అర్బన్‌లో 54, మద్దిపాడులో  52, కంభంలో 49, కారంచేడులో 41,శింగరాయకొండలో 39, పీసీపల్లి, పొదిలిల్లో 38, జె.పంగులూరులో 36, పామూరులో 34,  కనిగిరి రూరల్‌లో 33,ఎన్‌జీపాడులో 31,వైపాలెంలో 31,అద్దంకి అర్బన్‌లో 30 పాజిటివ్‌లు వెలుగు చూశాయి.త్రిపురాంతకంలో 28, చిన్నగంజాంలో 27, చీరాల రూరల్‌లో 27,కొనకనమిట్లలో 27,పుల్లలచెరువులో 27, ఎస్‌ఎన్‌పాడులో 27, టంగుటూరులో 27, లింగసముద్రంలో 25, చీమకుర్తిఅర్బన్‌లో 22, కొరిశపాడులో 22, ముండ్లమూరులో 19, పెద్దారవీడులో 19, ఉలవపాడులో 19,కందుకూరు అర్బన్‌లో 18 మందికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మార్టూరులో 18,కురిచేడు 16, చీమకుర్తి రూరల్‌ 16, బేస్తవారపేటలో 15, గిద్దలూరు అర్బన్‌లో 15, హెచ్‌ఎంపాడులో 14, కొమరోలులో 14, అద్దంకి రూరల్‌లో 13, గుడ్లూరులో 13,సీఎస్‌పురంలో 11,వెలిగండ్లలో 11,యద్దనపూడి 11, దోర్నాలలో 10 మందికి వైరస్‌ సోకింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా మంగళవారం  జిల్లాలోని ఆరు కేంద్రాల్లో 363 మందికి టీకా వేశారు. 


Updated Date - 2021-05-05T06:29:02+05:30 IST