ప్రత్యామ్నాయ పంటలే మేలు

ABN , First Publish Date - 2021-11-10T04:35:27+05:30 IST

పొగాకు పంట ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిన ప్రస్తుత పరి స్థితుల్లో ప్రత్యమ్నాయ పంటల సాగే మేలని టుబాకో బోర్డు ఆర్‌ఎం డి.వేణుగోపాల్‌ రైతుల కు సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలే మేలు
మాట్లాడుతున్న వేణుగోపాల్‌

ఆర్‌ఎం వేణుగోపాల్‌

టంగుటూరు, నవంబరు 9: పొగాకు పంట ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిన ప్రస్తుత పరి స్థితుల్లో ప్రత్యమ్నాయ పంటల సాగే మేలని టుబాకో బోర్డు ఆర్‌ఎం డి.వేణుగోపాల్‌ రైతుల కు సూచించారు. పొగాకుకు ప్ర త్యామ్నాయంగా ఇతర పంటలపై మంగళవారం టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రం అవరణలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రత్యమ్నాయ పంటలైన శనగ, మినుము, కంది, మిరప, దనియాలు, కొర్రలు, వాము, వేరుశనగ తదితర పంటలను సాగు చేసుకోవచ్చని సూచించారు. పొగాకు ప్రత్యమ్నాయ పంటల ద్వారా లాభాలు పొం దవచ్చునన్నారు.  కార్యక్రమంలో దర్శి, కృషి విఙ్ఞాన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.రమేష్‌, కందుకూరు సీటీఆర్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్‌ గంగాధర్‌, టంగుటూరు వేలం నిర్వహణాఽధికారి ఏ.శ్రీనివాసరావు, ఐటీసీ, జీపీఐ, పీఎస్‌ఎస్‌ కంపెనీల ప్రతినిధులు, టుబాకో బోర్డు సి బ్బంది, పొగాకు రైతుల సంక్షేమ సంఘం నాయకుడు పోతుల నర సింహారావు పాల్గొన్నారు 

చిరుధాన్యాలు సాగుచేయాలి

కొండపి, నవంబరు 9: పొగాకుకి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సా గు రైతులకు ఎంతో మేలని పొగాకు బోర్డు ఒంగోలు ప్రాంతీయ నిర్వహ ణాధికారి వేణుగోపాల్‌ అన్నారు. మంగళవారం కొండపిలోని వేలం కేంద్రంలో  పొగాకు రైతులకు జరిగి న ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులో ఆయన మా ట్లాడారు.  ఒకే పొలంలో పదేపదే ఒకే పంట వేయడం తగదన్నారు. ఈరకంగా రైతులు వేయడం వల్ల పొగాకు నాణ్యత తగ్గిపోతున్న దన్నారు. పెరిగిన పెట్టుబడుల దృష్ట్యా రైతులు పత్యామ్నాయ పంట లు వేసుకోవాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమే ష్‌ మాట్లాడుతూ పొగాకు ప్రత్నామ్నాయంగా కంది, మిరప, చిరు ధాన్య పంటలైన కొర్రలు, రాగులు, ఇతర పంటలైన మినుము, పెసర, పత్తి, శనగ పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ చార్జ్‌ వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌, ఏడీఏ సుభాషిణి, ఏవో వి.రాము, ఐటీసీ క్రాప్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ వెంకట్రావు, జీపీఐ ప్రతినిధి అనిల్‌, పీఎస్‌ఎస్‌ ప్రతినిధి రామాంజనేయులు, రైతు  నాయకులు బొడ్డపాటి బ్రహ్మయ్య, భాస్కర్‌ చౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T04:35:27+05:30 IST