ఆర్‌బీకేల ద్వారా అన్నీ సేవలు

ABN , First Publish Date - 2021-12-10T05:22:40+05:30 IST

రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా రైతులకు అన్నిరకాల సేవలు అందిస్తున్నట్టు జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ చెప్పారు.

ఆర్‌బీకేల ద్వారా అన్నీ సేవలు
కిసాన్‌మేళాను ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ

జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

దర్శి, డిసెంబరు 9: రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా రైతులకు అన్నిరకాల సేవలు అందిస్తున్నట్టు జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ చెప్పారు.  గురువా రం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో నిర్వహించిన కిసాన్‌మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకా లను రైతులు సద్వినియోగం చేసుకోవాల న్నారు. రైతుల అభ్యున్నతి కోసం పెట్టుబడి నిధి అందిస్తున్నట్టు చెప్పారు. శాస్రవేత్తల సూ చనలు పాటించి రైతులు లాభాలబాటలో ముం దుకు సాగాలని వెంకాయమ్మ పేర్కొన్నారు. గుం టూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ రత్నప్రసాద్‌ మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలపై దృష్టిసారించాలన్నారు. జిల్లాలో ఎర్రనేల లు అధికంగా ఉన్నందున ఆ భూములకు అనువైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. జేడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు సాగుచేసిన పంటలను తప్పనిసరిగా ఈ క్రాప్‌ నమోదు చేయించుకోవాలని సూ చించారు. 

ఈ సందర్భంగా వివిధశాఖల అధికారులు, ప్రైవేట్‌ సంస్ధలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను  వెంకాయమ్మ పరిశీలిం చారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశో ధన కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ భారతి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ ఆశాదేవి, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినే టర్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, గుంటూరు లాంఫాం విస్త్రరణ సంచాలకులు పి. రాంబాబు, హర్టీకల్చర్‌ పరిశోధన కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ ముత్యాల నాయుడు, ఏరు వాక కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, దర్శి ఏడీఏ కె.అర్జున్‌ నాయక్‌, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-10T05:22:40+05:30 IST