ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2021-12-26T05:14:54+05:30 IST

గుంటూరులో జనవరి 29, 30, 31 తేదీలలో జరిగే ఏఐటీయూసీ 17వ రా ష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్ర నాథ్‌ పిలుపునిచ్చారు.

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
మాట్లాడుతున్న రవీంద్రనాథ్‌


మార్కాపురం(వన్‌టౌన్‌), డిసెంబరు 25 : గుంటూరులో జనవరి 29, 30, 31 తేదీలలో జరిగే  ఏఐటీయూసీ 17వ రా ష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్ర నాథ్‌ పిలుపునిచ్చారు. స్థానిక పూలసుబ్బయ్య భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ హయాంలో కార్మికుల హక్కులకు భంగం కలిగే విధంగా చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు. జనవరి 29న జరిగే కార్మిక గర్జన సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ సీనియర్‌ నాయకుడు అందె నాసరయ్య, జిల్లా కార్యదర్శి షేక్‌ కాశిం పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-26T05:14:54+05:30 IST