పెద్దలపై గౌరవంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-29T06:02:41+05:30 IST

విద్యార్థులు తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవం, ప్రేమాభిమానాలతో ఉండాలని జూనియర్‌ ప్రిన్సిపల్‌ జూనియ ర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్‌ అన్నారు.

పెద్దలపై గౌరవంగా ఉండాలి
విద్యార్థులతో ముచ్చటిస్తున్న జడ్జిలు రాజేష్‌, సరిత


గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 28 :  విద్యార్థులు తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవం, ప్రేమాభిమానాలతో ఉండాలని జూనియర్‌ ప్రిన్సిపల్‌ జూనియ ర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్‌ అన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా కోర్టు ఆవరణలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో రాజేష్‌, అడిషనల్‌ సివిల్‌ జడ్జి సరిత మాట్లాడారు. వారి చదువుల గురించి ఆరా తీశారు. సమాజాభివృద్ధికి పాటుపడతాయని, తల్లిదండ్రులను గౌరవించాలని, తోటి వారిని అభిమానించాలని సూచించారు. గ్రామాలలో కూడా ఎలాంటి గొడవలకు పోకూడదని, తల్లిదండ్రులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మల్లికార్జునరావు, పిచ్చయ్య పాల్గొన్నారు. 

రాచర్లలో..

రాచర్ల :  విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు చట్టాలను తెలుసుకో వాలని జడ్జి బి.రాజేష్‌ అన్నారు. కస్తూర్బాలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా చట్టాలపై జడ్జి అవగా హన కల్పించారు.  కార్యక్రమంలో న్యాయవాదులు తిరుమలప్రసాద్‌, పిచ్చయ్య, పారాలీగల్‌ వలంటీర్లు ఏలియా, అన్నోజీరావు, ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T06:02:41+05:30 IST