సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలి

ABN , First Publish Date - 2021-12-26T05:33:34+05:30 IST

పని సర్దుబాటులో భా గంగా ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులను హైస్కూళ్లకు నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఉత్తర్వులు తీవ్ర అసంబద్ధంగా ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బారెడ్డి రంగారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలి


గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 25 : పని సర్దుబాటులో భా గంగా ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులను హైస్కూళ్లకు నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఉత్తర్వులు తీవ్ర అసంబద్ధంగా ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని  యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బారెడ్డి రంగారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. నూతన విద్యావిధానంలో భా గంగా ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను సమీప హైస్కూళ్లలో విలీనం చేస్తూ  జీవో విడుదల చేయడం సరి కాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 1:30 ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి ఉండాల్సి ఉం డగా చాలా పాఠశాలల్లో 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకే ఉపాధ్యాయుడిని ఉంచి మిగిలిన వారిని హైస్కూళ్లకు పంపడం జరిగింది. దీని వలన ప్రాథమిక, యూపీ పాఠశాలలు అన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి మూతపడతాయని తెలిపారు. దీని వలన పేద విద్యార్థులు విద్యకు దూరమై డ్రాప్‌ అవుట్లుగా మారుతారని ఆయన పేర్కొన్నారు. మొత్తం పోస్టులను రద్దు చేసి క్రమబద్ధీకరణ జరిపి కౌన్సెలింగ్‌ ద్వారా నియామకాలు జరపాలని ఆ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-12-26T05:33:34+05:30 IST