పొదిలమ్మ గుడి స్థలంలో ఆక్రమణలు కూల్చేందుకు ప్రయత్నం

ABN , First Publish Date - 2021-07-12T05:57:47+05:30 IST

పట్టణంలో పొదిలమ్మ గుడికి సంబంధించి స్థలం ఆక్ర మ ణలు తొలగించేందుకు ఎండోమెంట్‌ అధికా రు లు ఆదివారం చర్యలు చేపట్టారు.

పొదిలమ్మ గుడి స్థలంలో ఆక్రమణలు కూల్చేందుకు ప్రయత్నం
ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకుంటున్న ఆక్రమణదారులు

అడ్డుపడడంతో 

వెనుదిరిగిన అధికారులు

పొదిలి (రూరల్‌) జూలై 11 : పట్టణంలో పొదిలమ్మ గుడికి సంబంధించి స్థలం ఆక్ర మ ణలు తొలగించేందుకు ఎండోమెంట్‌ అధికా రు లు ఆదివారం చర్యలు చేపట్టారు. ఆక్రమణ దారులు అడ్డుపడటంతో అధికారులు వెను దిరి గారు. పొదిలమ్మ గుడికి సంబంధించి సర్వే నెం బరు 829-1లో 1.33 సెంట్లు గుడి నిర్మాణం జరిగిందని అధికారులు తెలిపారు. మరో సర్వే నెంబరు 829-2లో 6.25 ఎకరాల భూమి ఉంది. అందులో బుగ్గచలం వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం 20 సెంట్లకు చలానా కట్టి ని ర్మాణం జరిపినట్లు వారు తెలి పారు. మిగిలిన 6.05 ఎకరాల్లో కొంత భాగం ఆక్రమించి ఇళ్ల  నిర్మాణం చేశారని కందుకూరు డివిజన్‌ ఇన్‌ స్పెక్టర్‌ శైలేంద్రకుమార్‌ తెలిపారు. అవి పరిశీ లనలో ఉన్నాయి. మరికొంత మంది గత వారం రోజులుగా మరో 15  ఇళ్లను అక్రమంగా ని ర్మిస్తున్నారని తెలిసి పోలీస్‌ బం దోబస్తుతో  ఆ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లారు. అక్కడి వారు నకిలీ డాక్యుమెంట్లతో అ డ్డుపడ్డారని ఎండోమెంట్‌ అధికారులు చెప్పారు. పోలీసుల సూచనల మేరకు భూములను సర్వే చే యిం చి బౌండరీని ఏర్పాటు చేయాలని సూ చించ డంతో  వెనుదిరిగారు. రెండు రోజుల్లో రె వె న్యూ అధికారులకు చలానా తీసి ఫిర్యాదు చే స్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఈవో రవికుమార్‌, అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-07-12T05:57:47+05:30 IST