ఉన్నత విద్యతో ఉపాధికి సోపానం

ABN , First Publish Date - 2021-10-29T06:01:23+05:30 IST

ఉన్నత విద్యలు ఉపాధికి సోపానాలవంటివని సీఆర్పీ శైలజ వ్యాఖ్యానించారు.

ఉన్నత విద్యతో ఉపాధికి సోపానం
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సీఆర్పీ


కంభం, అక్టోబరు 28 :  ఉన్నత విద్యలు ఉపాధికి సోపానాలవంటివని సీఆర్పీ శైలజ వ్యాఖ్యానించారు. గురువారం మండలంలోని పలు పాఠశాలల ఆవరణలో విద్యార్థులకు విద్య ఆవశ్యకతను వివరించారు. 10వ తరగతి పూర్తి కాగానే చదువు ఆపివేయడం సమంజసం కాదన్నారు. ఇంటర్‌, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదవడం ద్వారా సమాజంలో గౌరవంతోపాటు ఉపాధికి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు.  క్లిష్టపరిస్థితుల్లో చదువును మధ్యలో ఆపినా తిరిగి కొనసాగించడానికి ఓపెన్‌ స్కూల్స్‌, దూరవిద్య లాంటి పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చదువుకు మధ్యలో స్వస్తి చెప్పిన వారికి అవగాహన కల్పిస్తూ పలువురు విద్యార్థులను ప్రేరేపించారు. కార్యక్రమంలో సీఆర్పీలు అనురాధ, శైలజ, మురళీమోహన్‌, రామలింగయ్య, బాబూరావు, రవీంద్రనాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T06:01:23+05:30 IST