అసమానతలు లేని సమాజం విద్యతోనే సాధ్యం

ABN , First Publish Date - 2021-11-29T04:55:43+05:30 IST

సామా జిక అసమానతలు, సాంఘిక దురాచారా ల నిర్మూలన విద్యతోనే సాధ్యమని న మ్మిన తొలి సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంక య్య అన్నారు.

అసమానతలు లేని సమాజం విద్యతోనే సాధ్యం
పూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న డాక్టర్‌ వెంకయ్య

టంగుటూరు, నవంబరు 28: సామా జిక అసమానతలు, సాంఘిక దురాచారా ల నిర్మూలన విద్యతోనే సాధ్యమని న మ్మిన తొలి సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంక య్య అన్నారు. పూలే వర్ధంతి సందర్భం గా  ఆదివారం టంగుటూరు బస్టాండ్‌ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి వెంక య్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుజ నుల బతుకుల్లో వెలుగులు నింపిన ధీరు డు పూలే అని అన్నారు. కుల వివక్షత లేని సమాజం కోసం అహర్నిశలు పోరాడారని చెప్పారు. మహిళల విద్యకోసం ముందుగా తన భార్య సావిత్రీభాయ్‌పూలేని విద్యావంతు రాలను చేసి ఆమె ద్వారా మహిళల కోసం మొట్టమొదటిగా పాఠ శాలను ఏర్పాటుచేసి వారికి విద్యాబుద్ధులు నేర్పించారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, జడ్పీటీసీ మన్నం అరుణకుమారి, కుంటి మల్లారెడ్డి/వంశరాజ్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టా వెంకట్రావు, యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బొట్లా రామారావు పాల్గొన్నారు  

కొండపి: జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా కొండపిలోని విద్యుత్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ఏఈ కుంచాల కోటయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే బడుగువర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. కార్యక్ర మంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది, తాటాకుల పాలెం సర్పంచ్‌ షేక్‌ వన్నూరు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

శాలివాహన సంఘం ఆధ్వర్యంలో పూలే వర్ధంతి కార్యక్రమాన్ని కొండపిలో నిర్వహిం చారు. కార్యక్రమంలో శాలివాహన సంఘం నాయకులు ఇజ్జిగిరి పెదకాశయ్య, సుబ్బయ్య,  బడుగు నాగభూషణం, సీపీఐ కార్యదర్శి గు రవయ్య, బీసీ సంఘం నాయకులు జాన్‌, బ్ర హ్మయ్య పాల్గొని పూలేకు నివాళులర్పిం చారు.  

మర్రిపూడి: భావితరాలకు మహాత్మ జ్యోతీ రావు పూలే స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని విశ్వ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు ఈదుమూడి రవిప్రసాద్‌ అన్నారు. పూలే 131 వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మర్రిపూడిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవిప్రసాద్‌ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం మారుతుందని నమ్మిన గొప్ప మహనీయుడు పూలే అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఈదుమూడి ప్రసాద్‌ ఆచారి, మండల యువజన సంఘం అధ్యక్షుడు అనీల్‌ కుమార్‌, కోశాధికారి నూతలపాటి సుబ్బరామయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్టుపల్లి శ్రీనివాసులు, శ్రీశైల స్వామీజీ,  నాయ కులు గురు బ్రహ్మం, చిన్నవీరయ్య, హరిబాబు, శ్రీను, సాయి, తరుణ్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T04:55:43+05:30 IST