ఒంగోలు ఎంఈవోకు అరుదైన అవకాశం
ABN , First Publish Date - 2021-10-21T06:04:42+05:30 IST
ఒంగోలు మండల విద్యాధికారి టి.కిషోర్ బాబుకు అ రుదైన అవకాశం లభించింది. నైపుణ్యభారత్ రాష్ట్రస్థాయి అకడమిక్ టాస్క్‌ఫోర్స్ టీంలో ఆయనకు స్థానం కల్పిస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఒంగోలువిద్య, అక్టోబరు 20 : ఒంగోలు మండల విద్యాధికారి టి.కిషోర్ బాబుకు అ రుదైన అవకాశం లభించింది. నైపుణ్యభారత్ రాష్ట్రస్థాయి అకడమిక్ టాస్క్‌ఫోర్స్ టీంలో ఆయనకు స్థానం కల్పిస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయిలో ఒక ఎంఈవోకు మాత్రమే అవకాశం రాగా, అది కిషోర్‌బాబుకు దక్కడం విశేషం. ఈనెల 27న న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీలో జ రిగే ప్రాంతీయస్థాయి వర్కషాప్‌కు రాష్ట్రం నుంచి అకడమిక్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యు డిగా హాజరవుతున్నట్లు కిషోర్‌బాబు వెల్లడించారు.