తొలిరోజు 60శాతం మంది హాజరు
ABN , First Publish Date - 2021-02-02T05:18:39+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నేపఽథ్యంలో గతేడాది మార్చిలో మూతబడిన ప్రాథమిక పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి.

ప్రాథమిక పాఠశాలల్లో తరగతులు ప్రారంభం
ఒంగోలు విద్య, ఫిబ్రవరి 1: కరోనా వైరస్ వ్యాప్తి నేపఽథ్యంలో గతేడాది మార్చిలో మూతబడిన ప్రాథమిక పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. వి ద్యార్థులంతా సోమవారం బడిబాట పట్టారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు చదువు తున్న విద్యార్థులు 2.20లక్షల మంది ఉండగా, వీరిలో సుమారు 60శాతం మంది మొదటి రోజు పాఠశాలలకు హాజరయ్యారు. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తీసుకుని వారిని ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి అనుమ తించారు. పాఠశాల ప్రధాన ద్వారం వద్దే శానిటైజ్ చేశా రు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నాడు. మద్దిపాడు మండలంలో ప్రాథమిక పాఠశా లలను సోమవారం పాఠశాల విద్య గుంటూరు ఆర్జేడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో సుబ్బారావు ఆకస్మికంగా తని ఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, కొవిడ్ జా గ్రత్తలను పరిశీలించారు.