16 మంది ఎంపిక

ABN , First Publish Date - 2021-01-12T07:32:49+05:30 IST

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జీవనజ్యోతి డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం జాబ్‌మేళ నిర్వహించారు.

16 మంది ఎంపిక

గిద్దలూరు, జనవరి 11 : స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జీవనజ్యోతి డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం జాబ్‌మేళ నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్‌మేళకు హాజరయ్యారు. 38 మంది నిరుద్యోగ యువతీయువకులు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 16 మంది నిరుద్యోగులను వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు జిల్లా అధికారి లోకనాథం తెలిపారు. జాబ్‌మేళలో ఈ సంస్థ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ భాషా, కోఆర్డినేటర్‌ నాగమణి, జీవనజ్యోతి డిగ్రీ కళాశాల డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-12T07:32:49+05:30 IST