145 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-01-14T04:50:07+05:30 IST

అయినముక్కుల గ్రామ సమీపంలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దోర్నాల నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు ఏపీ27ఈజడ్‌ 1485 నెంబరు గల మినీ లారీ, ఆటోలో రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం అందడంతో ఎస్సై హరిబాబు పోలీసులతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

145 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న లారీ, ఆటో సీజ్‌ 

ఇద్దరు అరెస్టు

పెద్ద దోర్నాల, జనవరి 13 : అయినముక్కుల గ్రామ సమీపంలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దోర్నాల నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు ఏపీ27ఈజడ్‌ 1485 నెంబరు గల మినీ లారీ, ఆటోలో రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం అందడంతో ఎస్సై హరిబాబు పోలీసులతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. రెండు వాహనాలలో 45 కేజీల బరువుతో ఉన్న 145 బస్తాల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. లారీని సీజ్‌ చేశారు. నంద్యాలకు చెందిన మొగిలి సుబ్బరాయుడు, మక్కెళ్ల చిరంజీవి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. 

Updated Date - 2021-01-14T04:50:07+05:30 IST