వైఎస్‌ఆర్‌కు నివాళి

ABN , First Publish Date - 2021-07-09T03:25:49+05:30 IST

మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా గురువారం పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌ సమీపంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నిశాళులర్పించారు.

వైఎస్‌ఆర్‌కు నివాళి
వైఎస్‌ఆర్‌ అగ్రీల్యాబ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు

గూడూరురూరల్‌, జూలై 8: మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా గురువారం పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌ సమీపంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నిశాళులర్పించారు. కార్యక్రమంలో పొణకా దేవసేన, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోడూరు మీరారెడ్డి, మేరిగ మురళీధర్‌, నాశిన నాగులు, తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో  రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కుమారుడు నవీన్‌గుప్తా ప్రారంభించారు. చేగువేరా ఫౌండేషన్‌ ప్రతినిధి మండ్ల సురేష్‌బాబు ఆధ్వర్యంలో నివాళులర్పించారు చెన్నూరులో రైతుభరోసా కేంద్రాన్ని, ప్రాంతీయ పశువైద్యశాలలో నియోజకవర్గస్థాయి పశువ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని, గాంధీనగర్‌లో వైఎస్‌ఆర్‌ అగ్రిల్యాబ్‌ను ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు ప్రారంభించారు.  తహసీల్దారు లీలారాణి, పశుసంవర్ధకశాఖ డీడీ వెంకటస్వామి, ఏడీ సురేష్‌కుమార్‌,  ఏడీఏ శివనాయక్‌, ఏవో నాగమోహన్‌రావు, ఎంపీడీవో నాగమణి తదితరులు పాల్గొన్నారు.

వెంకటగిరి(టౌన్‌):  త్రిభువని సెంటర్‌, తహసీల్దార్‌ కూడలి వద్ద  ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి  నివాళులర్పించారు.  కేఆర్‌పీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.   ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ, చేనేత రాష్ట్ర డైరెక్టర్‌ నక్కా వెంకటేశ్వరరావు, కలిమిలి రాంప్రసాద్‌ రెడ్డి, ఢిల్లీబాబు, మేరువ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

రాపూరు: రాపూరు పట్టణంతోపాటు గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా  పలుచోట్ల వైసీపీ నాయకులు వేర్వేరుగా నివాళులర్పించారు.

కోట :  కోట క్రాస్‌రోడ్డులో వైసీపీ నేతలు నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి,  పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మోబిన్‌బాషా నివాళులర్పించారు. గూడలి, ఊనుగుంటపాళెం,  కర్లపూడి, నెల్లూరుపల్లికొత్తపాళెంలో ఆయా గ్రామాల నాయకులు నివాళులర్పించారు.  

వాకాడు : నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వాకాడులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అన్నదానం చేశారు.  మామిడి పండ్లను పంచిపెట్టారు.  కొడవలూరు భక్తవత్సల్‌రెడ్డి, పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చిట్టేటి కృష్ణారెడ్డి, రైతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2021-07-09T03:25:49+05:30 IST