రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మేకపాటి

ABN , First Publish Date - 2021-07-09T02:31:29+05:30 IST

సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అ

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మేకపాటి
సీతారామపురంలో కళాకారులకు డప్పులు అందిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరి రూరల్‌, జూలై 8: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక ఆనకట్ట వద్దనున్న వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని సచివాలయం-3, రైతు భరోసా కేంద్రాలు-1,2ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాల వ్యవస్థ ఏర్పాటు చేసి సుస్థిర పాలన అందిస్తున్నారన్నారు.   అనంతరం తహసీల్దారు కార్యాలయంలో అర్హులైన పేదలకు జగనన్న ఇంటి నివేశన స్థల పట్టాలు పంపిణీ చేయడం తోపాటు ఉత్తమ పాడి రైతులు చిలకల మాలకొండారెడ్డి, నాయబ్‌లకు ప్రశంసాపత్రాలతోపాటు రూ.5 వేల నగదు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ సుబ్బారెడ్డి, తహసీల్దారు సుధాకర్‌, ఎంపీడీవో వీరాస్వామి, నాయకులు చేజర్ల సుబ్బారెడ్డి, మూలె సుబ్బారెడ్డి, వినయ్‌రెడ్డి, ఎస్థాన్‌, ముర్తుజా,  తదితరులు పాల్గొన్నారు. 



 ఆర్‌బీకేల ప్రారంభం


సీతారామపురం, జూలై 8 : మండలంలోని బసినేనిపల్లి, సీతారామపురం, సింగారెడ్డిపల్లి గ్రామాల్లోని  రైతుభరోసా కేంద్రాల(ఆర్‌బీకే)తోపాటు, పలు సచివాలయ భవనాలను గురువారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని  ఆయన చేసిన సేవలను  కొనియాడారు. తదుపరి కేక్‌ కట్‌ చేసి మొక్కలు నాటారు.  మండలంలో అర్హులైన 14 మంది డప్పు కళాకారులకు బసినేనిపల్లి సచివాలయం వద్ద డప్పులతోపాటు ఇతర సామగ్రిని  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, మండల వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



 అల్లూరులో..

అల్లూరు, జూలై 8 : దివంగత ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమాన్ని అల్లూరు మండలంలో అధికారులు వేడుకగా నిర్వహించారు. అల్లూరు పేటలో వ్యవసాయాధికారి లలిత, పశు శాఖ ఏడీ మాలకొండయ్యల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి రైతులను సత్కరించారు.కార్యక్రమంలో నాయకులు నీలం సాయికుమార్‌, మేడా కృష్ణారెడ్డి, ఉస్మాన్‌షరీఫ్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


 వైయస్‌ జయంతి వేడుకలు 

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతిని పురస్కరించుకొని అల్లూరు మండలంలో వైసీపీ నాయకులు వేడుకలను నిర్వహించారు. అల్లూరు పాతబస్టాండు కూడలిలోని రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు.  కార్యక్రమంలో  నీలం సాయికుమార్‌, మేడా కృష్ణారెడ్డి, ఉస్మాన్‌షరీఫ్‌, సామంతుల సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


జలదంకిలో..

జలదంకి, జూలై8: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు గురువారం జలదంకి మండలంలో వైసీపీ నాయకులు గ్రామగ్రామాన జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచిపెట్టారు. జలదంకిలో సర్పంచ్‌ చలంచర్ల అనూరాధ, సొసైటీ డైరెక్టర్‌ ఇస్కా మదన్‌మోహన్‌రెడ్డిలు, సోమవరప్పాడులో వైసీపీ నేత చేవూరి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. జమ్మలపాలెంలో జలదంకి సొసైటీ అధ్యక్షుడు కేతిరెడ్డి రవీంద్రరెడ్డి ఆద్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో సర్పంచ్‌ బుర్రి శ్రీవేణి తదితరులు పాల్గొన్నారు. 


  భవనాల ప్రారంభం

 రైతు దినోత్సవం సందర్భంగా జలదంకి మండలంలో రెండు ప్రభుత్వ  భవనాలను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి  గురువారం ప్రారంబించారు. చినక్రాకలో  గ్రామీణ పశువైద్యశాల, కమ్మవారిపాలెంలో రైతుభరోసా కేంద్రాన్ని ఆయన  ప్రారంభించారు.  ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ డీవీ క్రిష్ణారెడ్డి, మండల వైసీపీ కన్వీనర్‌ దగుమాటి మాల్యాద్రిరెడ్డి, జలదంకి సొసైటీ అధ్యక్షుడు కేతిరెడ్డి రవీంద్రరెడ్డి, కమ్మవారిపాలెం సర్పంచ్‌ తమ్మినేని సతీష్‌నాయుడు,  తదితరులు పాల్గొన్నారు.


వరికుంటపాడులో..


వరికుంటపాడు, జూలై 8: మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఎంసీ చైర్మన్‌ అలీఅహ్మద్‌ తోటలచెరువుపల్లి, పెద్దిరెడ్డిపల్లి, నార్త్‌కృష్ణంరాజుపల్లి, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కేక్‌లు కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఆర్‌బీకేల్లో వైఎస్‌ఆర్‌ జయంతిని పురస్కరించుకొని రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ గుంటుపల్లి రామాంజనేయులు, వైసీపీ మండల, బూత్‌ కన్వీనర్లు మందలపు తిరుపతినాయుడు, మాగంటి సిద్ధయ్య, ఎంపీడీవో సురేష్‌బాబు, ఏఈవో శివజ్యోతి,, సర్పంచ్‌ దిలీప్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-07-09T02:31:29+05:30 IST