ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-09T04:45:47+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్‌ కూడలిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహంతో పాటు మండలంలోని జొన్నవాడ, మినగల్లు, పెనుబల్లి, దామరమడుగు, రెడ్డిపాళెం, నాగమాంబాపురం, కట్టుబడిపాళెం, రేబాల తదితర గ్రామాల్లో వైసీపీ నాయకులు వైఎస్సార్‌ 72వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు
బుచ్చి: మినగల్లులో రైతులకు దాణా, నట్టల నివారణ మందు అందజేస్తున్న సర్పంచ్‌, తదితరులు

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 8: బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్‌ కూడలిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహంతో పాటు మండలంలోని జొన్నవాడ, మినగల్లు, పెనుబల్లి, దామరమడుగు, రెడ్డిపాళెం, నాగమాంబాపురం, కట్టుబడిపాళెం, రేబాల తదితర గ్రామాల్లో  వైసీపీ నాయకులు వైఎస్సార్‌ 72వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అదే విధంగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రేబాలలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించి, రైతులకు వైసీపీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, పంచాయతీ అధికారి శ్యాంసుందర్‌, వ్యవసాయాధికారి సురేంద్రరెడ్డి చేతుల మీదుగా రెండు గ్రూపులకు రోటోవేటర్లు, గడ్డి చుట్టే యంత్రం, స్ర్పేయర్లు పంపిణీ చేశారు. అనంతరం మినగల్లు సర్పంచ్‌ బొర్రు పూజిత మాట్లాడుతూ సమస్యలతో వచ్చే రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సచివాలయ, రైతుభరోసా కేంద్రాల ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమాల్లో .పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, వెటర్నరీ వైద్యులు సూర్యప్రకాశ్‌రావు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కరీం, సుబ్బారెడ్డి, రవిచంద్ర, ఓడా పెంచలయ్య, పెనుబల్లి సెక్రటరీ, జొన్నవాడ ప్రసాద్‌, వైసీపీ  నాయకులు సుబ్బారెడ్డి, రవిచంద్ర పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.   

విడవలూరు, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు గురువారం మండలంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విడవలూరు, ముదివర్తి, ఊటుకూరు, వావిళ్ల, అన్నారెడ్డిపాళెం, రామచంద్రాపురం. దండిగుంట, వరిణి గ్రామాల్లోని వైసీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, పూండ్ల అచ్యుత్‌రెడ్డి, కొండూరు వెంకటసుబ్బారెడ్డి, రామిరెడ్డి విజయభానురెడ్డి, వంశీరెడ్డి,  కొండూరు లక్ష్మీనారాయణరెడ్డి, బెల్లంకొండ శ్రీధర్‌, మల్లికార్జున, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. 

రైతు సంక్షేమానికి కృషి : రైతుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వ్యవసాయాధికారి వెంకట కిష్ణయ్య తెలిపారు. మండలంలోని ఊటుకూరులో స్థానిక వైసీపీ నాయకుడు రామిరెడ్డి విజయభానురెడ్డి చేతుల మీదుగా రైతులకు స్ర్పేయర్లను అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, హరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

తోటపల్లిగూడూరు, జూలై 8 : మండలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తోటపల్లిగూడూరులో వైసీపీ కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, మన్నెం సుబ్రహ్మణ్యంగౌడ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే పోట్లపూడిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి,  వరకవిపూడిలో సర్పంచ్‌ ఇసనాక రమేష్‌రెడ్డి, వరిగొండలో వైఎస్‌ఆర్‌ యూత్‌ ప్రతినిధి ఉప్పల కిశోర్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు జరిగాయి. అదేవిధంగా మండలంలోని 22 గ్రామ పంచాయతీలలో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ మన్నెం చిరంజీవి గౌడ్‌, గూడూరు విష్ణుకుమార్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు. 

రైతు భరోసా కేంద్రాల్లో..: మండలంలోని 16 రైతు భరోసా కేంద్రాల్లో గురువారం మాజీ సీఎం వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి యు.గీతాకుమారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కార్యక్రమాల్లో సర్పంచులు ఉయ్యాల భాస్కర్‌, వ్యవసాయశాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.  

ముత్తుకూరు, జూలై 8: మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా గురువారం రైతు దినోత్సవాలను జరిపారు.  కృష్ణపట్నం రైతు భరోసా కేంద్రంలో ఉపసర్పంచ్‌ రాగాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెదపాళెం సుబ్బయ్య, గోవిందయ్య, ఉదయభాస్కర్‌, వీఆర్వో అవినాష్‌, కార్యదర్శి రాజశేఖర్‌, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.  

ఇందుకూరుపేట, జూలై 8 : రైతు దినోత్సవం సందర్భంగా మండలంలో దాదాపు రూ.10లక్షలు విలువైన   వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. గురువారం జగదేవిపేటలో ఆర్‌బీకే తరపున రైతులకు రూ.6.6లక్షల విలువ గల వివిధ పనిముట్లను, కొత్తూరు ఆర్‌బీకే తరపున రూ.3.3లక్షల వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు మారుతీదేవి వ్యవసాయాధికారి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకూరుపేట రూరల్‌ బ్యాంకు చైర్మన్‌ మావులూరు శ్రీనివాసులురెడ్డియాదవ్‌, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్‌, డేగపూడి శ్రీనివాస్‌రెడ్డి, అవినాష్‌, తదితరులు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పంపిణీ చేశారు. తొలుత వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  

పల్లెపాడులో...: మండలంలోని పల్లిపాడులో వైసీపీ నాయకులు గూడూరు జయరామయ్య నాయకత్వంలో దివంగత నేత  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద కార్యకర్తల సమక్షంలో పంచాయతీ మెంబర్‌ నువ్వూరు మహేష్‌ వైసీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పల్లిపాడు వైస్‌ ప్రెసిడెంట్‌ లేబూరు సుమంత్‌రెడ్డి, పంచాయతీ మెంబరు రామయ్య నాయుడు, రమేష్‌రెడ్డి, దువ్వూరు శాంతికుమార్‌రెడ్డి, నెల్లూరు వెంకటేశ్వర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలోని కొరుటూరులో సర్పంచ్‌ పామంజి కృష్ణవేణి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతిని వైసీపీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు.   కార్యక్రమంలో నాయకులు పార్లమెంటరీ మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్‌.షబ్బీర్‌, వైస్‌ సర్పంచ్‌ తుమ్మల ప్రసాద్‌, పామంజి శ్రీనివాసులు, షేక్‌.ఖాజారంతుల్లా, స్వర్ణ శ్రీనివాసులురెడ్డి, వెలుగు తిరుమలరావు, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మనుబోలు, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని   గురువారం మనుబోలులో వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. మనుబోలుతో పాటు వీరంపల్లి, చెర్లోపల్లి, మడమనూరు, కట్టువపల్లి, కాగితాలపూరు గ్రామాల్లో వైఎస్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి వైసీపీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పలువురికి మిఠాయిలు పంచిపెట్టారు.   అలాగే మండలంలోని 14 రైతు భరోసా కేంద్రాల్లో రైతు దినోత్సవాన్ని వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది నిర్వహించారు.   

కోవూరు, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి జయంతిని   పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన సాయిబాబా దేవాలయ సమీపంలోని, మైథిలీ కూడలిలోని వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు జన బాంధవునిగా రైతు సంక్షేమానికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి, రామిరెడ్డి మల్లిఖార్జునరెడ్డి,  పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహులురెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, సర్పంచ్‌ యాకసిరి విజయ  తదితరులు పాల్గొన్నారు.   

వెంకటాచలం, జూలై 8 : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయుడని మాజీ జడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య అన్నారు. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా వెంకటాచలంలోని సెయింట్‌ జ్యూడ్స్‌ మానసిక వికలాంగుల వసతి గృహంలోని పిల్లలకు గురువారం పండ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేసి, కేక్‌ కట్‌ చేశారు. అలాగే కసుమూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నాటకం శ్రీనివాసులు, గంటా బాబు, పఠాన్‌ హుస్సేన్‌, కడివేటి శివ, పఠాన్‌ బాబర్‌, ఎంఎస్‌ దస్తగిరి, ఎంఎస్‌ లియాఖత్‌, మంద కృష్ణ, శ్రీకాంత్‌ తదితరులున్నారు.

 

వైఎస్‌ఆర్‌ ఆలోచనతోనే ‘వీఎస్‌యూ’  

వెంకటాచలం, జూలై 8 : వీఎస్‌యూ మూల కారకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్డర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జిల్లాకొక యూనివర్సిటీని స్థాపించాలన్న ఆలోచనతోనే     విక్రమ సింహపురి యూనివర్సిటీ పుట్టిందని వర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో గురువారం వైఎస్‌ఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. జాతీయ సేవా పథకం, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని రిజిస్ర్టార్‌ ప్రారంభించారు.    కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ జి. సుజయ్‌, డిప్యూటి రిజిస్ర్టార్‌ డాక్టర్‌ సాయిప్రసాద్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-09T04:45:47+05:30 IST