జాతీయ భావాలున్న యువత రాజకీయాల్లోకి రావాలి
ABN , First Publish Date - 2021-01-13T04:10:17+05:30 IST
జాతీయ భావాలు కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ పిలుపునిచ్చారు.

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని
వెంకటగిరి, జనవరి 12: జాతీయ భావాలు కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ పిలుపునిచ్చారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన తొలిపారిగా మంగళవారం వెంకటగిరికి రావడంతో ఆయన మి త్రులు స్థానిక పింజల వీరయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏబీవీపీ నాయకుడిగా తన ప్రస్థానం విశ్వోదయ కళాశాల మైదానం నుంచే ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుల, కుటుంబ కంపెనీలుగా మారిపోయాయని విమర్శించారు. అనంతరం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడు దయాకరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు సురేంద్రమోహన్‌ను మిత్రులు పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జయభారత్ ఆసుపత్రి జనరల్ మేనేజరు గురుప్రసాద్, బీజేపీ నాయకులు అల్లం చంద్రమోహన్ రావు, రంగినేని కృష్ణయ్య, ఎస్‌ఎ్‌సఆర్ నాయుడు, వడ్లమూడి బాస్కర్, శ్రవణ్‌కుమార్, పూర్వపు ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.