వైసీపీ మానవహారం
ABN , First Publish Date - 2021-10-21T04:35:28+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించాయి.

నెల్లూరు (జడ్పీ), అక్టోబరు 20 : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాగుంట విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఆరోగ్యకరమైన విమర్శలు చేయాలే తప్ప సంస్కార హీనంగా మాట్లాడకూడదన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టాభి వ్యాఖ్యలు నీచమైనవని విమర్శించారు. పట్టాభి మాటలు టీడీపీవి కాదు అనుకుంటే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, సీఎం జగన్మోహన్రెడ్డికి క్షమాపణలు చెప్పించాలని లేనిపక్షంలో చంద్రబాబు వాటికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.