టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2021-02-09T04:35:57+05:30 IST

డక్కిలి మండలం నర్సనాయుడు పల్లికి చెందిన వైసీపీ నాయకుడు మచ్చల వేణు సోమవారం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో తన అనుచరులతో కలసి టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిక
టీడీపీలో చేరిన వైసీపీ నాయకుడు మచ్చల వేణు

వెంకటగిరి, ఫిబ్రవరి 8: డక్కిలి మండలం నర్సనాయుడు పల్లికి చెందిన వైసీపీ నాయకుడు మచ్చల వేణు సోమవారం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో తన అనుచరులతో కలసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు విజయడంకా మోగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల బెదిరింపులకు బయపడాల్సిన అవసరం లేదని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులను కోరారు. డక్కిలి పంచాయతీలో తమ మద్దతుదారుడి విజయం తథ్యమన్నారు.

Updated Date - 2021-02-09T04:35:57+05:30 IST