టీడీపీ జిల్లా నేతలకు సత్కారం
ABN , First Publish Date - 2021-07-09T02:39:12+05:30 IST
టీడీపీ జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న మన్నవ రవిచంద్ర, బొగ్గవరపు శ్రీను, ఏగూరి చంద్రశేఖర్‌లను గురువారం టీడీపీ డివి

కావలిటౌన్, జూలై8: టీడీపీ జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న మన్నవ రవిచంద్ర, బొగ్గవరపు శ్రీను, ఏగూరి చంద్రశేఖర్‌లను గురువారం టీడీపీ డివిజన్ కార్యాలయంలో అభినందన సత్కారం అందచేశారు. మాజీ జిల్లా కార్యదర్శి గుత్తికొండ కిషోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ మాజీ రీజినల్ చైర్‌పర్సన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరిలు, టీడీపీ పార్లమెంట్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాకి ప్రసాద్‌లు పాల్గొని వారిని సత్కరించారు. కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కోసూరు వెంకటేశ్వర్లు, నేతలు తటవర్తి వాసు, మల్లికార్జున రెడ్డి, దావులూరి దేవ, మంచాల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.