నిజనిర్ధారణ కమిటీ కాదు... వైసీపీ కమిటే పరిశీలించింది

ABN , First Publish Date - 2021-08-11T05:19:30+05:30 IST

మండలంలోని కంటేపల్లిలో జరిగిన అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి సమక్షంలో పరిశీలించేందుకు వెళ్లింది అఖిలపక్ష నిజనిర్ధారణ కమిటీ కాదని, వైసీపీ కమిటేనని టీడీపీ ఎస్సీ సెల్‌ నేతలు ఎద్దేవా చేశారు.

నిజనిర్ధారణ కమిటీ కాదు... వైసీపీ కమిటే పరిశీలించింది
మాట్లాడుతున్న టీడీపీ ఎస్సీ సెల్‌ నేతలు

వెంకటాచలం, ఆగస్టు 10 : మండలంలోని కంటేపల్లిలో జరిగిన అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి సమక్షంలో పరిశీలించేందుకు వెళ్లింది అఖిలపక్ష నిజనిర్ధారణ కమిటీ కాదని, వైసీపీ కమిటేనని టీడీపీ ఎస్సీ సెల్‌ నేతలు ఎద్దేవా చేశారు. వెంకటాచలంలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రావెల్‌ తవ్వకాలను అఖిలపక్ష నిజనిర్ధారణ కమిటీ పరిశీలించించడం జరిగిందని ఎమ్మెల్యే కాకాణి చెప్పారని, కానీ అఖిలపక్ష నిజనిర్ధారణ కమిటీ అంటే టీడీపీ, బీజేపీ, జనసేన, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ ఇలా అన్ని పార్టీలు వస్తాయన్నారు. ఆ పార్టీల తరపున  మండలాధ్యక్షులు పాల్గొనాలని, లేనిపక్షంలో జిల్లా నుంచి ఆ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలన్నారు. అలా కాకుండా ఒకటి రెండు పార్టీల నుంచి కార్యకర్తలను తీసుకువెళ్లి పరిశీలించామంటే ఎలా అవుతుందన్నారు.  ఈ నేపథ్యంలో  త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ దళిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పాళెపు మణి, ఆస్తోటి సుబ్బయ్య, యాకల రవి, ఆరుముళ్ల రమణయ్య, గిద్దలూరు వెంకటేశ్వర్లు, దాసి చక్రధర్‌, వెంకటరమణయ్య, రవి, శేషయ్య, ఎం సుబ్బయ్య తదితరులున్నారు.  



Updated Date - 2021-08-11T05:19:30+05:30 IST