పెన్నాలో మహిళ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-11-23T05:40:49+05:30 IST

మండలంలోని వరికుంటపాడు వద్ద పెన్నానదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్ధానికులు గుర్తిం చారు. విషయాన్ని పోలీసులకు సమాచారం

పెన్నాలో మహిళ మృతదేహం లభ్యం

అనంతసాగరం, నవంబరు 22: మండలంలోని వరికుంటపాడు వద్ద పెన్నానదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్ధానికులు గుర్తిం చారు. విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వెలికి తీయించగా గుర్తుపట్టని విధంగా వుంది. నీలి రంగు పంజాబీ డ్రస్‌, కుడి కాలుకు వెంట్రుకలతో కూడిన దారం ఉండి సుమారు 50 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. రెండురోజుల క్రితం సోమశిల జలాశయం వద్ద రెండు మృతదేహాలు బయటపడిని విషయం తెలిసిందే. కాగా ఇది మూడవది. వర్షాలకు కడప జిల్లాలో గల్లంతైన వారు ప్రవాహంలో కొట్టుకువస్తున్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు.

Updated Date - 2021-11-23T05:40:49+05:30 IST