ఆత్మహత్యాయత్నం చేసిన యువతి మృతి

ABN , First Publish Date - 2021-10-29T04:32:31+05:30 IST

మండలంలోని రెడ్డివారికండ్రిక గ్రామానికి చెందిన యువతి షంషాద్‌(28) మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసి నెల్లూరు వైద్యశాలలో చికిత్సపొందుతూ

ఆత్మహత్యాయత్నం చేసిన యువతి మృతి

చేజర్ల, అక్టోబరు 28: మండలంలోని రెడ్డివారికండ్రిక గ్రామానికి చెందిన యువతి షంషాద్‌(28) మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసి నెల్లూరు వైద్యశాలలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. యువతి ఇంట్లోనే ఉంటూ తల్లికి తోడుగా ఉండేది. అయితే ఇటీవల కొన్నిరోజులుగా మౌనంగా ఉంటోంది. ఈ నేపఽథ్యంలో మంగఽళవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యు లు నెల్లూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెం దింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ విజయ్‌శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-29T04:32:31+05:30 IST