మహిళలు ఆర్థికాభివృద్ది సాధించాలి

ABN , First Publish Date - 2021-10-30T03:30:09+05:30 IST

మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెలుగు పీడీ సాంబశివారెడ్డి అన్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ది సాధించాలి
మాట్లాడుతున్న వెలుగు పీడీ సాంబశివారెడ్డి

 గూడూరు, అక్టోబరు 29: మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెలుగు పీడీ సాంబశివారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో డివిజన్‌ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్దిని సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీ శశిధర్‌, ఏపీడీ రాజు, మధుసూదన్‌, మురళీ, వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T03:30:09+05:30 IST