‘పేదలందరికీ ఇల్లు జాబితా’ ఎక్కడ?

ABN , First Publish Date - 2021-02-07T04:59:30+05:30 IST

ప్రభుత్వం అందిస్తున్న పేదలందరికీ ఇల్లు జాబితా ఎక్కడుందని జేసీ ప్రభాకర్‌రెడ్డి సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు.

‘పేదలందరికీ ఇల్లు జాబితా’ ఎక్కడ?
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

 సచివాలయ సిబ్బందిని ప్రశ్నించిన జేసీ 

నెల్లూరు (సిటీ), ఫిబ్రవరి 6 : ప్రభుత్వం అందిస్తున్న పేదలందరికీ ఇల్లు జాబితా ఎక్కడుందని జేసీ ప్రభాకర్‌రెడ్డి సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. శనివారం ఆయన నగరంలోని రంగనాయకులపేట, కపాడిపాళెం ప్రాంతాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాబితా ఎక్కడుంది? అందులో ఎంతమంది ఉన్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆయా వీఆర్వోల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారిని మందలించారు. మరోసారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పేదలందరికీ ఇల్లు జాబితాను వెంటనే ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం పలు సంక్షేమ పథకాల పని తీరు, లబ్ధిదారుల ఎంపికపై ఆరా తీశారు.

Updated Date - 2021-02-07T04:59:30+05:30 IST