సర్పంచు, కార్యదర్శిపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-09-03T06:17:19+05:30 IST
ఏఎస్‌పేట, సెప్టెంబరు 2:

ఏఎస్‌పేట, సెప్టెంబరు 2: పంచాయతీ మెంబర్లకు తెలియకుండానే వారు ఆమోదించినట్లు సర్పంచు, కార్యదర్శి కలిసి తీర్మానాలు చేస్తున్నారని దీనిపై విచారణ జరపాలని గురువారం పెద్దహబీపురం పంచాయతీ మెంబర్లు ఉసా మాలకొండయ్య, కొండారెడ్డి, పద్మ, శారద, తదితరులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన తీర్మాన కార్యక్రమంలో తమ ప్రమేయం లేకుండానే ఆమోదించినట్లు తీర్మానించారని వాపోయారు.