బలిజ, కాపు, తెలగలు ఐక్యం కావాలి

ABN , First Publish Date - 2021-11-24T03:57:54+05:30 IST

బలిజ, కాపు, తెలగలు ఐకమత్యంగా మెలగాలని బలిజ, కాపు, తెలగ సంక్షేమ సంఘం నేతలు కోరారు.

బలిజ, కాపు, తెలగలు ఐక్యం కావాలి
గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న నేతలు

కావలిటౌన్‌, నవంబరు 23: బలిజ, కాపు, తెలగలు ఐకమత్యంగా మెలగాలని బలిజ, కాపు, తెలగ సంక్షేమ సంఘం నేతలు కోరారు. మంగళవారం స్థానిక పుల్లారెడ్డినగర్‌లోని కల్యాణ మండపంలో బలిజ, కాపు, తెలగ కులస్తుల సమావేశం జరిగింది. ఐకమత్యాన్ని పెంపొందించుకోవడం, సామాజిక సమస్యల పరిష్కార మార్గాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈనెల 28న పట్టణంలోని పెంకుల ఫ్యాక్టరీ కాలనీ వద్దనున్న నరసింహస్వామి ఆలయం వద్ద కాపు, బలిజ, తెలగల ఆత్మీయ సమావేశం జరుగుతుందని, సామాజిక వర్గీయులందరు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం గోడపత్రిక ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో సంఘం నేతలు చింతాల వెంకట్రావు, పోలిశెట్టి శ్రీనివాసులు, ఊసా వెంకట్రావు, దామిశెట్టి పూర్ణచంద్రరావు, మెతుకు రాజేశ్వరి, మండలి కృష్ణారావు, నున్నా వెంకట్రావు, వెంకట సుబ్బయ్య, కొణిదెల హరిప్రసాద్‌, తోట వెంకటేశ్వర్లు, బండారు మహేష్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-24T03:57:54+05:30 IST