పాశురగానం.. పురుషోత్తమ సాయుజ్యం

ABN , First Publish Date - 2021-12-19T05:37:40+05:30 IST

శ్రీమన్నారాయణుడిని చేరుకునేందుకు గోదాదేవి ఆలపించిన పాశురగానంతో ధనుర్మాస ఉత్సవాలు జిల్లాలోని వైష్ణవాలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి.

పాశురగానం.. పురుషోత్తమ సాయుజ్యం
వేణుగోపాల స్వామి ఆలయంలో ఊంజల్‌ సేవలో ఆండాళ్‌ అమ్మవారు

వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు


నెల్లూరు (సాంస్కృతికం) 

శ్రీమన్నారాయణుడిని చేరుకునేందుకు గోదాదేవి ఆలపించిన పాశురగానంతో  ధనుర్మాస ఉత్సవాలు జిల్లాలోని వైష్ణవాలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరు మూలాపేటలోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ఉదయం 4గంటలకు గోవు విశ్వరూపదర్శనం, తిరువారాధన, తిరుప్పావై సేవాకాలం, నివేదన, సర్వదర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం  జరిగాయి. సాయంత్రం దీపారాధన, ప్రాకారోత్సవం, తిరుప్పావై ప్రవచనాలు జరిగాయి. 

Updated Date - 2021-12-19T05:37:40+05:30 IST