వైభవంగా గంధ మహోత్సవం

ABN , First Publish Date - 2021-11-03T04:26:14+05:30 IST

శ్రీశ్రీశ్రీ హజరత్‌ సయ్యద్‌ ఖజా రహమతుల్లా నాయబ్‌ రసూల్‌ దర్గా గంధ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి వైభవంగా నిర్వహించారు.

వైభవంగా గంధ మహోత్సవం

ఏ ఎస్‌ పేట, నవంబరు2 :శ్రీశ్రీశ్రీ హజరత్‌ సయ్యద్‌ ఖజా రహమతుల్లా నాయబ్‌ రసూల్‌ దర్గా గంధ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి వైభవంగా నిర్వహించారు.  దర్గా ముతవలి హఫీజ్‌పాషా  గంధ కలశాన్ని తలపై ధరించి మహల్‌ నుంచి భక్తికీర్తనాలు, వాయిద్యాలు, మేళతాలు, కొబ్బరి ధివీటుల వెలుగుల్లో ఊరేగింపుగా దర్గాకు తరలించారు. స్వామి సమాధికి లేపనం చేసి, ప్రతేక్య ప్రార్థనలు నిర్వహించారు. గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో గ్రామ వీధులు కిటకిటలాడాయి.

Updated Date - 2021-11-03T04:26:14+05:30 IST