వ్యవసాయ పనులకు రైతుల సన్నద్ధం

ABN , First Publish Date - 2021-11-03T02:47:03+05:30 IST

: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అటు డెల్టా, ఇటు మెట్ట రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నా

వ్యవసాయ పనులకు రైతుల సన్నద్ధం
గూడలి వద్ద పొలాల్లో చేరిన వర్షపునీరు

కోట, నవంబరు 2 : ప్రస్తుతం కురుస్తున్న  వర్షాలకు అటు డెల్టా, ఇటు మెట్ట రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. మెట్ట రైతులు ఎల్ది పైర్లను  సాగుచేశారు. ఆ పైర్లకు నీరులేక ఎండిపోయేదశలో ఉన్న సమయంలో వర్షం కురుస్తుండడంతో ఊపిరి పోసిన ట్లయ్యింది. మండలంలోని మద్దాలి, మద్దాలికండ్రిగ, రాఘవాపురం, రామాపురం, వజ్జవారిపాళెం, అన్నంబాక గ్రామాల్లో మెట్ట రైతులు  వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్నా రు. అలాగే  గూడలి, తిన్నెలపూడి, వెంకన్నపాళెం, తిమ్మానా యుడుపాళెం గ్రామాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 


Updated Date - 2021-11-03T02:47:03+05:30 IST