వీఎస్‌యూ అభివృద్ధికి కృషి చేయండి: డాక్టర్‌ హేమచంద్రారెడ్డి

ABN , First Publish Date - 2021-09-03T03:20:04+05:30 IST

విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ డాక్టర్‌ హేమచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

వీఎస్‌యూ అభివృద్ధికి కృషి చేయండి: డాక్టర్‌ హేమచంద్రారెడ్డి
మాట్లాడుతున్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ డాక్టర్‌ హేమచంద్రారెడ్డి

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ డాక్టర్‌ హేమచంద్రారెడ్డి


వెంకటాచలం, సెప్టెంబరు 2 : విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ డాక్టర్‌ హేమచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో గురువారం ఆధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యా విధానంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ మార్పుల గురించి ఎప్పటికప్పడు తెలుసుకుని విద్యార్థులకు సక్రమమైన విద్యాబోధన చేసేందుకు సన్నద్ధం కావాలన్నారు. కరోనా నేపథ్యంలో విద్యాబోధనలో జరిగిన మార్పులకు అనుగుణంగా విద్యాబోధనపై ఆధ్యాపకులందరూ దృష్టి సారించాలన్నారు. వీఎస్‌యూలో ప్రతిభావంతమైన ఆధ్యాపకులకు కొదవలేదని, అందరూ కలిసికట్టుగా అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌ తదితరులున్నారు. 


డిగ్రీ పరీక్షలకు 1,417 మంది గైర్హాజరు

వెంకటాచలం  : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో గురువారం జరిగిన డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలకు 1,417 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వీఎస్‌యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ సీఎస్‌. సాయిప్రసాద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన రెండవ సెమిస్టర్‌ పరీక్షల్లో 433 మంది విద్యార్థులకు గాను 335 మంది విద్యార్థులు హాజరు కాగా.. మిగిలిన 98మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ పరీక్షల్లో 11,102 మంది విద్యార్థులకు గాను 9,783 మంది విద్యార్థులు హాజరు కాగా మిగిలిన 1,319 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. 


Updated Date - 2021-09-03T03:20:04+05:30 IST