వివాహితపై లైంగిక దాడికి యత్నం
ABN , First Publish Date - 2021-05-06T03:22:40+05:30 IST
: వివాహిత స్నానం చేస్తుండగా లైంగికదాడికి యత్నించిన నిందితుడి ఉదంతమిది. ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి కఽథనం మేరకు, మండలంలోని తోటపల్లి దళి

తోటపల్లిగూడూరు, మే 5 : వివాహిత స్నానం చేస్తుండగా లైంగికదాడికి యత్నించిన నిందితుడి ఉదంతమిది. ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి కఽథనం మేరకు, మండలంలోని తోటపల్లి దళితవాడకు చెందిన ఓ వివాహిత బూత్‌రూంలో స్నానం చేస్తుండగా రెండురోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన పాకం రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి ఆవరణంలోకి ప్రవేశించాడు. అంతేకాక బాత్‌రూంలోకి చూడడంతో భయపడిన వివాహిత బయటకు వచ్చింది. దాంతో నిందితుడు పారిపోయాడు. చుట్టుపక్కల వెతగ్గా నిందితుడు దాబాపై నక్కి కూర్చున్నట్లు బాధితురాలు బుధవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తే నిందితుడి నుంచి సరైన సమాధానం రాలేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.